![]() |
.webp)
ఈ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. కానీ అన్ని కథలు మనకు తెలియవు. కొన్ని కథలు మాత్రం రియాలిటీ షోస్ ద్వారా బయటకు వస్తూ ఎంతో మంది ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. అలాంటి రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ కూడా ఒకటి . ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్స్ ని ఫిల్టర్ చేసే పనిలో ఉంది. అలంటి ఈ షోలో రాజకుమారి అనే కంటెస్టెంట్ స్టోరీ మాత్రం చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉంది. జీవితంలో ఒక మనిషి యుద్దాన్ని ఎలా చేయాలో ఆమె జీవితాన్ని వింటే తెలుస్తుంది. అలాంటి రాజకుమారి స్టేజి మీదకు వచ్చి తన లైఫ్ ని మొత్తం నాన్ స్టాప్ గా చెప్పేసింది.
" తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నుంచి వచ్చాను. నా పేరు రాజకుమారి. నాకు ముగ్గురు పిల్లలు. నాకు ఇష్టం లేకపోయినా మా మావయ్యకు ఇచ్చి పెళ్లి చేశారు. అతను నేను నల్లగా ఉన్నానని మూడు నెలలకు వెళ్లి పిన్ని వాళ్ళ అమ్మాయిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఏడాది తర్వాత నాకు రెండో పెళ్లి చేశారు. అతను కూడా బాధ్యతగా ఉండడు. తనతో ఎన్ని బిజినెస్ లు చేయించినా నేనే ఓడిపోయాను. అప్పుడు అర్ధమయ్యింది మార్చాల్సింది అతన్ని కాదు మారాల్సింది నేను అని. నా ముగ్గురు పిల్లలతో రోడ్డు మీద నిలబడ్డ .చివరికి తిప్పలు పడి ఒక ఇల్లు కట్టాను. అది కూడా పూర్తికాలేదు కానీ నీడ దొరికింది. నన్ను నేను నిరూపించుకోవడానికి నాకున్న యాక్టింగ్ టాలెంట్ తో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ లక్ష మంది ఫాలోవర్స్ ని సంపాదించా. ఆ టైములో నాకు బైక్ యాక్సిడెంట్ అయ్యింది. లెఫ్ట్ సైడ్ బుగ్గ మీద ఉన్న ఎముక విరిగిపోయింది. దాంతో నా పిల్లలు నా దగ్గరకు రావడానికి భయపడేవాళ్లు. ఒక నెల రోజులు వాళ్ళు నా దగ్గరకు రాలేదు . నా మొహం నేనే అద్దంలో చూసుకోలేకపోయా. అప్పుడే డిసైడ్ అయ్యా నా ప్రాణం పోలేదు కదా అనుకున్నా. ఒక నెల రోజుల్లో రికవరీ అయ్యాను. భయం అనే షార్ట్ ఫిలింలో అవకాశం వచ్చింది. దానికి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నా. 10 వ తరగతి తర్వాత నేను నేర్చుకున్న టైలరింగ్ నా జీవనోపాధి అయ్యింది. నేను బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నానంటే నేను ఇప్పుడు మిషన్ కుట్టి నా పిల్లలను చదివించి అనుకున్న స్థాయికి వాళ్ళను తీసుకెళ్లలేను. నా కలను నెరవేర్చుకోవడానికి నా పిల్లల చదువులకు డబ్బు అవసరం . ఈ రెండింటి కోసం నాకు వచ్చిన ఈ బిగ్ బాస్ గోల్డెన్ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాను. నేను బిగ్ బాస్ షోలోకి వెళ్తే నాలా నలుపుగా ఉన్న కొంతమందైనా ధైర్యంగా బయటకు వచ్చి బతకుతారని అనుకుంటున్నాను. నా చిన్న బాబు దిండు లేకుండా నా పొట్ట మీద పడుకునేవాడు కానీ అలాంటిది నాకు యాక్సిడెంట్ ఐనప్పుడు నన్ను చూసి పారిపోయేవాడు. పిల్లల కోసం ఇంత కష్టపడుతుంటే ఇలా అయ్యిందేమిటా అని భయమేసింది. " అని రాజకుమారి తన జీవితం మొత్తాన్ని ఆవిష్కరించింది.
ఆమె మాటలకు నవదీప్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శ్రీముఖి, అభిజిత్, బిందు మాధవి ఆమె ఫైటింగ్ స్పిరిట్ కి ఫిదా ఇపోయారు. తర్వాత రాజకుమారి నవదీప్ చేసిన సినిమాల్లో ఆయన పక్కన ఉంటే బాగుందనిపించేది ఇప్పుడు కూడా ఉండాలనిపిస్తాది అంటూ సరదాగా ఫన్నీగా చెప్పింది . ఆ మాటలకు నవదీప్ లేచి స్టేజి మీదకు వచ్చి రాజకుమారితో కలిసి రాంప్ వాక్ చేశారు. ఐతే ముందు ఆయన్ని ఇంప్రెస్స్ చెయ్యి అని శ్రీముఖి చెప్పేసరికి పెన్ను , పాడ్ కావాలని చెప్పి రైట్ నుంచి లెఫ్ట్ కి తెలుగులో కవిత రాసి ఐ లవ్ యు సర్ అని చెప్పింది . తర్వాత ఇద్దరూ కలిసి రాంప్ వాక్ చేశారు. అలాగే తనకు సపోర్ట్ చేసిన వాళ్లకు ధన్యవాదాలు చెప్పింది. ఇంకా ఊరోళ్లంతా కుళ్ళుకుని సచ్చిపోండి అంటూ కూడా సరదాగా చెప్పి అందరినీ ఎంటర్టైన్ చేసి డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ సంపాదించేసింది.
![]() |